బీజేపీ సర్కారు వచ్చాకే దాడులు: రాహుల్ | Terrorist attacks rise in jammu kashmir | Sakshi
Sakshi News home page

బీజేపీ సర్కారు వచ్చాకే దాడులు: రాహుల్

Dec 7 2014 2:18 AM | Updated on Mar 18 2019 7:55 PM

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర దాడులు తిరిగి ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

రామ్‌గఢ్ (జార్ఖండ్): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర దాడులు తిరిగి ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. యూపీఏ పదేళ్ల పాలనలో కశ్మీర్‌లో శాంతి నెలకొందని, పర్యాటకులు వచ్చేవారని...కానీ మోదీ ప్రభుత్వం రాగానే ఉగ్ర కార్యకలాపాలు మొదలయ్యాయని జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రామ్‌గఢ్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ విమర్శించారు.
 
 కాగా, జమ్మూకశ్మీర్‌లో పోలింగ్ శాతం అధికంగా ఉండటంపట్ల పొరుగు దేశంతోపాటు దేశంలోని కొందరు అసంతృప్తికి లోనవుతున్నారని, ఇది దురదృష్టకరమని కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. మరోవైపు కశ్మీర్‌లో ఉగ్ర దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలసి పనిచేస్తూనే ఉంటామని చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement