బాబ్రీ, గోద్రాలవల్ల ‘ఉగ్ర’ ఆకర్షణ | 'Terror' attraction | Sakshi
Sakshi News home page

బాబ్రీ, గోద్రాలవల్ల ‘ఉగ్ర’ ఆకర్షణ

Jun 13 2016 2:11 AM | Updated on Sep 4 2017 2:20 AM

పలువురు భారతీయ యువకులు అల్ కాయిదా ఉగ్రవాదసంస్థ వైపు ఆకర్షితులవడానికి బాబ్రీ మసీదు విధ్వంసం(1992), గోద్రా అల్లర్లు(2002) కారణమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: పలువురు భారతీయ యువకులు అల్ కాయిదా ఉగ్రవాదసంస్థ వైపు ఆకర్షితులవడానికి బాబ్రీ మసీదు విధ్వంసం(1992), గోద్రా అల్లర్లు(2002) కారణమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేక విభాగం దాఖలు చేసిన  చార్జిషీట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది.

బాబ్రీ విధ్వంసం, గోద్రా అల్లర్లు తరువాతే పలువురు భారతీయ యువకులు అల్ కాయిదాలో చేరారని, భారత ఉపఖండంలో అల్‌కాయిదా(ఏక్యూఐఎస్) ఏర్పాటుకు యత్నిస్తున్నారని 17 మంది నిందితులపై దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొంది. వివిధ మసీదుల్లో జిహాద్ ఉపన్యాసాలు చేసే సందర్భంగా సయ్యద్ అంజార్ షా(అరెస్టైన నిందితుడు), మహ్మద్ ఉమర్(పరారీలో ఉన్న మరో నిందితుడు)ను కలిశాడని, భారత్‌లో ముస్లింలపై జరుగుతున్న దాడుల గురించి చర్చించుకున్నారని, ప్రత్యేకించి గోద్రా, బాబ్రీ అంశాలపై చర్చించారని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement