‘తేజస్‌ కూడా రఫెల్‌ అంత స్ట్రాంగే’ | Tejas is as good as French-made Rafale: Parrikar | Sakshi
Sakshi News home page

‘తేజస్‌ కూడా రఫెల్‌ అంత స్ట్రాంగే’

Nov 20 2016 12:59 PM | Updated on Sep 4 2017 8:38 PM

‘తేజస్‌ కూడా రఫెల్‌ అంత స్ట్రాంగే’

‘తేజస్‌ కూడా రఫెల్‌ అంత స్ట్రాంగే’

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్‌ కూడా త్వరలో ఫ్రాన్స్‌ దేశ నుంచి రాబోతున్న రఫెల్‌ యుద్ధ విమానాలంత పటిష్టమైనవని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు.

న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్‌ కూడా త్వరలో ఫ్రాన్స్‌ దేశ నుంచి రాబోతున్న రఫెల్‌ యుద్ధ విమానాలంత పటిష్టమైనవని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు. ప్రపంచంలోనే ఈ తరహా యుద్ధ విమానాలు మేలైనవని, సాటిలేనివని చెప్పారు. తేజస్‌ యుద్ధ విమానాలను ఈ ఏడాది ప్రారంభంలో భారత సైన్యానికి అప్పగించిన విషయం తెలిసిందే. ‘ఈ విమానాలు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.

ప్రపంచంలోని ఏ యుద్ధ విమానంతోనైనా పోటిపడే సత్తా ఉండేలా దీన్ని తయారు చేశారు. రఫెల్‌ యుద్ధ విమానమంతటి శక్తిమంతమైనది. అయితే, ఈ విమానం అత్యంత తేలికపాటి యుద్ధ విమానం’ అని పారికర్‌ అన్నారు. అయితే, రఫెల్‌ యుద్ధ విమానాలు తొమ్మిది టన్నుల పేలుడు పదార్థాలు మోసుకెళ్లగలిగితే తేజస్‌ మాత్రం మూడున్నర టన్నులు మోసుకెళుతుందని, 33 ఏళ్లపాటు తేజస్‌ సేవలు అందిస్తుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement