ఉగ్రవాదంలోకి రాజకీయ నేత కొడుకు | Tehreek-e-Hurriyat chairman’s missing son joins Hizbul Mujahideen | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదంలోకి రాజకీయ నేత కొడుకు

Mar 25 2018 3:53 AM | Updated on Sep 17 2018 5:36 PM

Tehreek-e-Hurriyat chairman’s missing son joins Hizbul Mujahideen - Sakshi

తెహ్రీక్‌–ఎ–హురియత్‌ పార్టీ చైర్మన్‌ అష్రఫ్‌ శెరాయ్‌, జునైద్‌

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని తెహ్రీక్‌–ఎ–హురియత్‌ అనే రాజకీయ పార్టీ చైర్మన్‌ కొడుకు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలో చేరాడు. పార్టీ చైర్మన్‌గా అష్రఫ్‌ శెరాయ్‌ ఇటీవలే ఎన్నికయ్యారు. 26 ఏళ్ల వయసున్న ఆయన కొడుకు జునైద్‌  శుక్రవారం   అదృశ్యమయ్యాడు. దీనిపై అష్రఫ్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఏకే–47 తుపాకీ పట్టుకుని ఆయుధాలు ధరించిన జునైద్‌ ఫొటో శనివారం సోషల్‌మీడియాలో కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement