పోలీస్ ఇంట్లో మృతదేహాల కలకలం! | Teenagers found dead in policeman's house | Sakshi
Sakshi News home page

పోలీస్ ఇంట్లో మృతదేహాల కలకలం!

Aug 27 2015 8:51 PM | Updated on Apr 7 2019 4:36 PM

పోలీస్ ఇంట్లో మృతదేహాల కలకలం! - Sakshi

పోలీస్ ఇంట్లో మృతదేహాల కలకలం!

ఓ పోలీస్ అధికారి అధికారి ఇంట్లో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు బయటపడటం కలకలం సృష్టించింది.

లక్నో: ఓ పోలీస్ అధికారి అధికారి ఇంట్లో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు బయటపడటం కలకలం సృష్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలురు ఓ పోలీస్ ఆఫీసర్ కు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంట్లో శవాలుగా పడి ఉన్నట్లు గుర్తిచినట్లు ఓ పోలీస్ తెలపాడు. ఇదిలాఉండగా వికాస్(15), ఆకాశ్(13) అనే ఇద్దరు బాలురు బుధవారం సాయంత్ర నుంచి కనిపించడం లేదంటూ వారి కుటుంబసభ్యులు ఫిర్యాదుచేశారు. చనిపోయిన వారు తప్పిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్న బాలురా.. లేక వీళ్లు వేరేనా అనేది పోలీసులకు అంతుపట్టడం లేదు. అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement