రూ.70 దొంగిలించిందనే అనుమానంతో అకృత్యం | Teacher forces female students to strip in class | Sakshi
Sakshi News home page

రూ.70 దొంగిలించిందనే అనుమానంతో అకృత్యం

Nov 5 2017 10:41 AM | Updated on Nov 5 2017 10:41 AM

Teacher forces female students to strip in class - Sakshi

భోపాల్‌ : దొంగతనం చేసిందనే అనుమానాంతో.. తరగతి గదిలోనే విద్యార్థిని వివస్త్రను చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌ పాఠశాలలో జరిగిం‍ది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. దమోహ్‌లోని రాణి దుర్గావతి హై స్కూల్లో పదో తరగతి బాలికల విభాగంలో దొంగతనం జరిగింది. ఒక బాలిక 70 రూపాయలను దొంగిలించిందనే అనుమానాన్ని బాధితురాలిపై తోటి విద్యార్థిని వ్యక్తం చేసింది. దీంతో మొదట బాధితురాలి పుస్తకాల బ్యాగును సోదా చేశారు. అందులో డబ్బులు దొరకకపోవడంతో..  బాధితురాలి బట్టలు విప్పించి వెదకమని టీచర్‌ చెప్పారు.

తరగతి గదిలో అందరిముందు జరిగిన అవమానాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు వివరించింది. ఆగ్రహించిన తల్లిందండ్రులు పాఠశాల యాజమాన్యానికి, జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారులు.. పాఠశాలకు నోటీస్‌ జారీ చేయడంతో పాటు.. సంబంధిత టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement