AI Image
జగిత్యాల జిల్లా: మూఢనమ్మకాలను విశ్వసించొద్దంటూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం నింపాల్సిన ఉపాధ్యాయురాలే ఓ విద్యార్థినిని భయభ్రాంతులకు గురిచేసిన ఘటన జగిత్యాల జిల్లా పెగడ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ విద్యార్థిని వసతిగృహంలో ఉంటూ ఇంటర్ చదు వుతోంది. ఆమె అప్పుడప్పుడూ అనారోగ్యానికి గురై ముభావంగా ఉంటోంది.
దీంతో అదే పాఠశాల ఉపాధ్యాయురాలు తరగతి గదిలో తోటి విద్యార్థినుల ముందే ఆమెను నిలబెట్టి ‘నువ్వు మైసమ్మవా.. దెయ్యానివా.. నీకేం కావాలి? ఈ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా వు?’ అని ప్రశ్నిస్తూ విద్యార్థినిని ప్రశ్నిస్తూ సుమా రు 10 నిమిషాలపాటు వీడియో తీయించింది. దీనికి ఆ విద్యార్థిని ఏమీ మాట్లాడకుండా మౌ నంగా ఉండిపోయింది. ఆ సమయంలో ఉపా ధ్యాయురాలు మరో విద్యార్థినితో జడ వేయించుకోవడం గమనార్హ. దీనిపై ఎంఈవో సులోచ నను వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందని.. ఉన్నతాధికారుల సూచనల మేరకు టీచర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: హీలియం గ్యాస్ పీల్చుకొని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య


