breaking news
stripp
-
రూ.70 దొంగిలించిందనే అనుమానంతో అకృత్యం
భోపాల్ : దొంగతనం చేసిందనే అనుమానాంతో.. తరగతి గదిలోనే విద్యార్థిని వివస్త్రను చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని దమోహ్ పాఠశాలలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. దమోహ్‌లోని రాణి దుర్గావతి హై స్కూల్లో పదో తరగతి బాలికల విభాగంలో దొంగతనం జరిగింది. ఒక బాలిక 70 రూపాయలను దొంగిలించిందనే అనుమానాన్ని బాధితురాలిపై తోటి విద్యార్థిని వ్యక్తం చేసింది. దీంతో మొదట బాధితురాలి పుస్తకాల బ్యాగును సోదా చేశారు. అందులో డబ్బులు దొరకకపోవడంతో.. బాధితురాలి బట్టలు విప్పించి వెదకమని టీచర్ చెప్పారు. తరగతి గదిలో అందరిముందు జరిగిన అవమానాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు వివరించింది. ఆగ్రహించిన తల్లిందండ్రులు పాఠశాల యాజమాన్యానికి, జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారులు.. పాఠశాలకు నోటీస్ జారీ చేయడంతో పాటు.. సంబంధిత టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
యువతితో మాట్లాడాడని స్తంభానికి కట్టేసి..
మంగళూరు: సహచర ఉద్యోగినితో మాట్లాడాడనే కారణంతో ఓ ముస్లిం వ్యక్తిని చితకబాదిన ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మొత్తం 13మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొంతమంది భజరంగ్ దళ్ కార్యకర్తలు ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం 29 ఏళ్ల ముస్లిం వ్యక్తి ఓ హిందూ యువతితో కారులో ఉండగా ఒక్కసారిగా ఓ గుంపు అతడిపై దాడి చేసింది. బట్టలూడదీసి కొట్టడమే కాకుండా వీధుల వెంట పరుగెత్తించారు. అనంతరం ఓ విద్యుత్ స్తంభానికి కట్టేసి దాదాపు గంట సేపు పిడిగుద్దులు గుప్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు స్థానిక టీవీ చానెల్లలో, వాట్సాప్‌లో హల్ చల్ రేపడంతో పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అయితే, బాధితుడు మాత్రం తాను.. ఆ యువతి ఒక మాల్ లో పనిచేస్తున్నామని, ఆమె లోన్ కట్టేందుకు డబ్బులు అవసరం ఉన్నాయని అడగడంతో ఇచ్చేందుకు ఏటీఎం వద్దకు కారులో వెళ్లానని ఇంతలోనే వారు వచ్చి దాడి చేశారని తెలిపాడు. ఈ విషయంలో ఆ అమ్మాయి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా ఆమెను కూడా తిట్టారని, ఆమె మాటలు పట్టించుకోలేదని వివరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.