తాగి డ్యాన్స్‌ చేస్తే నేరమా..! : ఎమ్మెల్యే

Suspended BJP MLA Pranav Singh Champion Clarification On Dancing Video - Sakshi

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే ప్రణవ్‌సింగ్‌ చాంపియన్‌ తప్పతాగి తుపాకులను చేతబూని చిందులేశారు. తన ప్రత్యర్థులను నానా బూతులు తిడుతూ ఆనందం పొందాడు. కాగా, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జర్నలిస్టు బెదిరింపులకు దిగాడన్న ఆరోపణలతో బీజేపీ నుంచి ఆయన ఇదివరకే సస్పెండ్‌ చేసింది. తనపై వస్తున్న విమర్శలపై ప్రణవ్‌సింగ్‌ స్పందించారు. మత్తులో చిందేస్తే తప్పేంటని, తాగినప్పుడు అలాంటివి జరగుతుంటాయని తన చర్యను సమర్థించుకున్నారు.‘మత్తులో ఉన్నప్పుడు డ్యాన్స్‌ చేస్తే తప్పేంటి. ఈ విషయాన్ని కావాలనే రాద్దాంతం చేస్తున్నారు. లైసెన్స్‌ కలిగిన తుపాకులున్నాయి. సరదాగా వాటిని పట్టుకునే డ్యాన్స్‌ చేశాను. అది నేరమా..? అయినా వాటిలో బులెట్లు లోడ్‌ చేసి లేవు. ఎవరికీ గురిపెట్టలేదు. తాగిన తమాషాలో అలా చేస్తుంటాం అది తప్పా. అసభ్యకరంగా మాట్లాడినందుకు చింతిస్తున్నాను. సారీ’అన్నారు. 

వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే ప్రణవ్‌ సింగ్‌ చాంపియన్‌ ఓ జర్నలిస్ట్‌ను బెదిరించిన కారణంగా పార్టీనుంచి సస్పెండ్‌ అయ్యారు. అయినప్పటికీ ఆయన తీరులో మార్పురాలేదు. కొద్దిరోజుల క్రితం మద్యం మత్తులో తుపాకులను పట్టుకుని డ్యాన్స్‌ చేస్తూ కెమెరాకు చిక్కారు. కాలు ఆపరేషన్‌ తర్వాత కోలుకున్న ఆయన మద్దతు దారులతో కలిసి చిందులు వేశారు. మద్యం తాగుతూ.. గన్నులను నోట్లో పెట్టుకుంటూ బాలీవుడ్‌ పాట‘‘ ముజ్‌కో రాణాజీ మాఫ్‌ కర్‌నా’’కు డ్యాన్స్‌ వేశారు. సంఘటనపై విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. ఆయుధాలకు లైసెన్స్‌ ఉందో లేదో తేల్చి, ఆయనపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top