
మంకీ మేనియా అంటే ఇదేనేమో!. కోతి చేతిలో కరెన్సీ కోసం జనం ఎగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చివరకు ఆ సొమ్ము అసలు ఓనర్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోగా.. దొరికిన నోట్లను పట్టుకుని జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఉత్తర ప్రదేశ్ ఔరయ్య Auraiya జిల్లా డొండాపూర్ గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అనూజ్ కుమార్ అనే రైతు తన తండ్రి రోహితాష్ చంద్రతో కలిసి భూమి నమోదు కోసం రూ.80,000 నగదు తీసుకుని మోపెడ్‌లో వచ్చారు. రోహితాష్ లాయర్‌తో పత్రాలు సిద్ధం చేస్తుండగా.. ఓ కోతి మోటార్ సైకిల్ ట్రంక్ తెరచి నగదు సంచిని లాక్కొని సమీప చెట్టుపైకి ఎక్కింది.
ఊహించని పరిణామంతో ఆ తండ్రీకొడుకులు షాక్‌లో ఉండిపోయారు. ఈలోపు చెట్టు మీద నుంచి కోతి నోట్లను చింపుతూ చుట్టూ విసరడం ప్రారంభించింది. ఆ ప్రాంగణంలో ఉన్నవారు నోట్ల వర్షాన్ని చూసి పరుగులు పెట్టారు. నోట్లు ఎరుకోవద్దని ఆ తండ్రీ కొడుకులు బతిమాలినా ఎవరూ వినలేదు. దీంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
उत्तर प्रदेश के औरैया में एक हैरान करने वाला मामला सामने आया। तहसील परिसर में बंदर किसान की बाइक से बैग ले उड़ा और पेड़ पर चढ़कर उसमें से नोट उड़ाने लगा। अचानक हुई "नोटों की बारिश" देख लोग इकट्ठा होकर पैसे लूटने लगे, जबकि किसान बेबस निहारता रह गया।#ViralVideo #Auraiya #Monkey pic.twitter.com/yEOueSxt9y
— Headlines Trend (@headlinetrend) August 27, 2025
చివరికి, రోహితాష్ కోతి ఎత్తుకెళ్లిన మొత్తంలో రూ.52,000 మాత్రమే తిరిగి పొందగలిగారు. కోతి చింపగా.. జనాలు ఎరుకుని పోయిన సొమ్ము రూ.28,000 ఉన్నట్లు వాపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. బిధూనా తహసీల్ ప్రాంతంలో కోతుల సమస్య చాలా కాలంగా ఉంది. కోతుల దాడి చేస్తాయనే భయంతో ఆ చుట్టుపక్కల ఎలాంటి ఆహార పదార్థాలను అమ్మరంట. ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించడమే కాకుండా జంతు సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని కూడా సోషల్ మీడియాలో పలువురు గుర్తుచేస్తున్నారు.