Uttarakhand: Angry tiger growls, charges towards tourists in Jim Corbett National Park - Sakshi
Sakshi News home page

పులి​కి కోపం వస్తే అలా ఉంటది.. టూరిస్ట్‌లు పరుగో పరుగు!

Apr 27 2023 1:13 PM | Updated on Apr 27 2023 1:32 PM

Angry Tiger Charges Towards Tourists In Jim Corbett National Park - Sakshi

ఎంజాయ్‌ కోసం ఓ పార్క్‌లోకి వెళ్లిన టూరిస్టులకు వింత అనుభవం ఎదురైంది. ఓ పులి చుక్కలు చూపించడంతో సఫారీలో పరుగు తీశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత్‌ నంద ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దీంతో, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లోకి సఫారీలో కొంతమంది పర్యాటకులు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వన్యప్రాణుల్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ.. వాటిని తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. ఆ సమయంలో ఓ చోట పొదల్లో వారికి పెద్ద పులి కనిపించింది. దీంతో సఫారీ జీప్‌ డ్రైవర్‌ కాసేపు వాహనాన్ని అక్కడే నిలిపివేయడంతో.. పర్యాటకులు పులిని ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. 

ఈ క్రమంలో పులికి తిక్కరేగడంతో ఒక్కసారిగా వారిపై దాడి చేసే ప్రయత్నం చేసింది. పులి ఒక్కసారిగా బిగ్గరగా గాండ్రిస్తూ సఫారీ జీపు వైపు దూసుకొచ్చింది. దీంతో పర్యాటకులు భయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన డ్రైవర్‌ వాహనాన్ని వెంటనే అక్కడి నుంచి ముందుకు పోనిచ్చారు. దీంతో పులి అక్కడి నుంచి వెనుదిరిగింది. కాగా, పులి ఆవేశాన్ని పర్యాటకులు తమ ఫోన్లలో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: ఓవర్‌నైట్‌ సెలబ్రిటీగా మారాడు.. వైరల్‌గా మారిన బీహార్‌ యువకుడి పాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement