breaking news
tiger roaring
-
పులికి కోపం వస్తే అలా ఉంటది.. టూరిస్ట్‌లు పరుగో పరుగు!
ఎంజాయ్ కోసం ఓ పార్క్‌లోకి వెళ్లిన టూరిస్టులకు వింత అనుభవం ఎదురైంది. ఓ పులి చుక్కలు చూపించడంతో సఫారీలో పరుగు తీశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లోకి సఫారీలో కొంతమంది పర్యాటకులు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వన్యప్రాణుల్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ.. వాటిని తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. ఆ సమయంలో ఓ చోట పొదల్లో వారికి పెద్ద పులి కనిపించింది. దీంతో సఫారీ జీప్ డ్రైవర్ కాసేపు వాహనాన్ని అక్కడే నిలిపివేయడంతో.. పర్యాటకులు పులిని ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పులికి తిక్కరేగడంతో ఒక్కసారిగా వారిపై దాడి చేసే ప్రయత్నం చేసింది. పులి ఒక్కసారిగా బిగ్గరగా గాండ్రిస్తూ సఫారీ జీపు వైపు దూసుకొచ్చింది. దీంతో పర్యాటకులు భయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని వెంటనే అక్కడి నుంచి ముందుకు పోనిచ్చారు. దీంతో పులి అక్కడి నుంచి వెనుదిరిగింది. కాగా, పులి ఆవేశాన్ని పర్యాటకులు తమ ఫోన్లలో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Striped monk gets irritated 😣 What will you do if at every designated hours people crash into your house as their matter of right? pic.twitter.com/4RDCVLWiRR — Susanta Nanda (@susantananda3) April 26, 2023 ఇది కూడా చదవండి: ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారాడు.. వైరల్‌గా మారిన బీహార్ యువకుడి పాట! -
కోటిపల్లిలో పెద్దపులి సంచారం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కొటిపల్లి మండలంలో గురువారం పెద్దపులి సంచరించింది. దీంతో స్థానికలు ఆందోళన చెందుతున్నారు. పులి సంచరిస్తుండంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోటిపల్లి గ్రామీణ సీఐ రాములు తెలిపారు. (కోటిపల్లి)