
అధికారుల అవినీతికి అద్ధం పట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంజినీర్లు, అధికారుల సమక్షంలోనే ప్రభుత్వం చేపట్టిన కాంట్రాక్ట్ డొల్లతనం బయటకు వచ్చింది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారుల అవినీతకి ప్రత్యక్ష సాక్ష్యం అంటూ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందే..
వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వాడ్వానీ తాలూకాలోని ఖడ్కి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో, ఈ మార్గంలో కొత్తగా బ్రిడ్జి నిర్మించి.. రోడ్డు వేయాలని స్థానికులు, విద్యార్థులు అధికారులను కోరారు. అంత వరకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరారు. ఇంతలో ఓ ఇంజినీరు మాత్రం అతికి పోయి.. అదే మార్గంలో పైపులు వేసి.. రోడ్డు నిర్మాణం చేపట్టాడు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద చిన్న బ్రిడ్జిలాగా పైపులైన్‌పై రోడ్డు నిర్మించారు. అనంతరం, రోడ్డు నిర్మాణ పనులను సమీక్షించేందుకు ఇంజినీర్, అధికారుల బృందం అక్కడికి చేరుకున్నారు. అనంతరం, వారు నిర్మించిన రోడ్డుపై లారీ వస్తున్న సమయంలో.. రోడ్డు కుంగిపోయి.. ఆ లారో బోల్తా కొట్టింది.
ఈ క్రమంలో భయంతో వణికిపోయిన అధికారుల బృందం.. పరుగులు తీశారు. చెట్టుకొకరు.. పుట్టకొకరు అనే విధంగా ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. ఓ అధికారి అయితే.. పక్కనే నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి బురద నీటిలో దాక్కునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది అధికారుల అవినీతికా ప్రత్యక్ష సాక్ష్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Engineer and his entire team had arrived in Beed, Maharashtra to inspect the road.
During the inspection, a truck got stuck on the road and overturned
This is the live demo testing of Corruption 🤡pic.twitter.com/InEpS94e3z— 🚨Indian Gems (@IndianGems_) July 10, 2025