వీడియో: కేదార్‌నాథ్‌ ఆలయం వద్ద తృటిలో తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

వీడియో: కేదార్‌నాథ్‌ ఆలయం వద్ద తృటిలో తప్పిన ప్రమాదం

Published Fri, May 24 2024 12:13 PM

Helicopter Emergency Landing In Kedarnath Temple Video Viral

డెహ్రాడూన్‌: కేదార్‌నాథ్ ఆలయం ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. భక్తులను కేదార్‌నాథ్‌ ధామ్‌కు తీసుకెళ్తున్న హెలికాప్టర్‌లో సాంకేతికలోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా హెలికాప్టర్‌ ఒడిదుడుకులకు లోనై భూమిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భక్తులు సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల ప్రకారం.. భక్తులను కేదార్‌ధామ్‌కు తీసుకువెళ్తున్న ఒక హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. హెలికాప్టర్‌ గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతికలోపం తలెత్తడంతో పైలెట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. కేదార్‌నాథ్ ధామ్‌కు 100 మీటర్ల ముందు ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది.

 

 

ఈ సందర్బంగా హెలికాప్టర్‌ ఒడిదుడుకులకు లోనైంది. ఒకానొక సమయంలో హెలికాప్టర్‌ భూమిని బలంగా ఢీకొట్టింది. అనంతరం సేఫ్‌గా ల్యాండ్‌ అయ్యింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమమంలో హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భక్తులు కూడా పైలట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ సందర్భంగా అది తమ మీద పడిపోతుందేమోనన్న భయంతో ఆలయం వద్ద ఉన్న భక్తులు పరుగు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement