అద్భుతమైన వీడియో.. థాంక్యూ! | Susanta Nanda Shares Adorable Video Of Golden Monkeys | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ మంకీస్‌ హగ్‌.. వైరల్‌ వీడియో

Apr 27 2020 1:08 PM | Updated on Apr 27 2020 1:47 PM

Susanta Nanda Shares Adorable Video Of Golden Monkeys - Sakshi

ఒక్క ఆత్మీయ ఆలింగనం చాలు లక్ష భావాలు పలికించడానికి... ఎదుటి వ్యక్తి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు. నీకు నేనున్నానే భరోసానిచ్చే అమృతమంత్రం అలయ్‌ బలయ్‌. మనుషులకే కాదు మాకు కూడా ఇలాంటి ఎమోషన్స్‌ ఉన్నాయంటున్నాయి గోల్డెన్‌ మంకీస్‌. ‘‘అందరికీ ప్రేమ కావాలి. ప్రమాదం పొంచి ఉందని భావించిన రెండు గోల్డెన్‌ మంకీలు ఇలా ఒకటినొకటి హత్తుకున్నాయి. ఆ శబ్దాలే అక్కడేం జరిగిందో చెబుతున్నాయి. మనుషుల వలె అవి కూడా ఇలా భావోద్వేగాలు పలికించాయి’’ అంటూ అటవీ శాఖ అధికారి సుసాంటా నందా షేర్‌ చేసిన వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ‘‘కరోనా కాలంలో ఇలాంటి వీడియో షేర్‌ చేసి.. సాటివారికి అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను ఈ కోతులు ఎంతో హృద్యంగా చెప్పాయి. ఆ రెండు కోతులను చూస్తుంటే మాటలు రావడంలేదు. అద్భుతమైన వీడియో షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు’’ అని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement