కోలీ ఉరిశిక్ష అమలుపై 29వరకూ సుప్రీం స్టే | supreme court stays Nithari killer Surendra Koli execution till october 29 | Sakshi
Sakshi News home page

కోలీ ఉరిశిక్ష అమలుపై 29వరకూ సుప్రీం స్టే

Sep 12 2014 11:48 AM | Updated on Sep 2 2018 5:20 PM

కోలీ ఉరిశిక్ష అమలుపై 29వరకూ సుప్రీం స్టే - Sakshi

కోలీ ఉరిశిక్ష అమలుపై 29వరకూ సుప్రీం స్టే

నిఠారీ వరుస హత్యల దోషి సురేందర్ కోలీ ఉరిశిక్ష అమలు నిలిపివేతను మరోసారి పొడిగించింది.

న్యూఢిల్లీ : నిఠారీ వరుస హత్యల  దోషి సురేందర్ కోలీ ఉరిశిక్ష అమలు నిలిపివేతను సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. కోలీ మరణశిక్ష అమలుపై  న్యాయస్థానం ఈనెల 29వరకూ స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ ఏఆర్ దవేతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది.

 

కోలీ ఉరి శిక్ష అమలుపై స్టే కోరుతూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను జూలైలో కోర్టు కొట్టేయడం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోలీ లాయర్లు రివ్యూ పిటిషన్ వేశారు. ఖైదీల రివ్యూ పిటిషన్‌పై బహిరంగ విచారణ జరపాలని ఈ నెల 2న సుప్రీం ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. అప్పటివరకు ఉరి అమలును నిలిపేయాలన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. శిక్ష అమలుపై స్టే విధించింది. ప్రస్తుం కోలీ మీరట్ జైలులో కట్టుదిట్టమైన భద్రత గల బ్యారక్‌లో ఉన్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement