‘వారికి మాత్రమే కరోనా టెస్టులు ఉచితం’ | Supreme Court Says Free Coronavirus Testing Only For Poor | Sakshi
Sakshi News home page

‘పేదలకే కరోనా టెస్టులు ఉచితం’

Apr 13 2020 7:24 PM | Updated on Apr 13 2020 7:25 PM

Supreme Court Says Free Coronavirus Testing Only For Poor   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను నిర్ధారించే పరీక్షలను పేదలకు మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉంచాలని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఈ ప్రయోజనం ఎవరు పొందాలో ప్రభుత్వమే నిర్ణయించాలని పేర్కొంది. కోవిడ్‌-19 ఉచిత పరీక్షలు అందరికీ చేపట్టాలని గతవారం సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. అందరికీ ఉచిత పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రైవేట్‌ లేబొరేటరీలు పేర్కొనడంతో సర్వోన్నత న్యాయస్ధానం తన నిర్ణయం మార్చుకుంది.

ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అర్హులైన వారికి, ప్రభుత్వం గుర్తించిన ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కోవిడ్‌-19 పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని కోర్టు సోమవారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అసంఘటిత కార్మికుల్లో అల్పాదాయ వర్గాల వారు, పత్ర్యక్ష నగదు బదిలీ లబ్ధిదారులు వంటి ఇతరులకూ ఉచిత పరీక్షలను వర్తింపచేయడంపై ప్రభుత్వం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది.

చదవండి : ఈ పరిస్థితుల్లో అలా ఆదేశించలేం: సుప్రీంకోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement