దినేశ్ రెడ్డి, ఉమేష్ కుమార్ పిటిషన్లను కొట్టేసిన సుప్రీం | Supreme court rejects Dinesh Reddy, Umesh kumar's Petitions | Sakshi
Sakshi News home page

దినేశ్ రెడ్డి, ఉమేష్ కుమార్ పిటిషన్లను కొట్టేసిన సుప్రీం

Nov 22 2013 12:25 PM | Updated on Sep 2 2018 5:20 PM

దినేశ్ రెడ్డి, ఉమేష్ కుమార్ పిటిషన్లను కొట్టేసిన సుప్రీం - Sakshi

దినేశ్ రెడ్డి, ఉమేష్ కుమార్ పిటిషన్లను కొట్టేసిన సుప్రీం

రాష్ట్ర మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి, మరో ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది.

రాష్ట్రానికి చెందిన ఇద్దరు మాజీ ఐపీఎస్ అధికారులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి, మరో మాజీ ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ఆదాయానికి మించి అక్రమాస్తులను కూడబెట్టారని తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ సుప్రీం కోర్టు సూచనలను కంటే ఎక్కువగా దర్యాప్తు చేస్తోందని దినేష్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని అడ్డుకోవాలంటూ ఆయన విన్నవించారు.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అక్రమాస్తుల కేసులో దినేశ్ రెడ్డిపై సీబీఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో ఐపీఎస్ అధికారి ఉమేశ్ కుమార్ ఫిర్యాదు మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుండగా తనపై విచారణను మేజిస్ట్రేట్ కోర్టులో జరపాలంటూ మరో ఐపీఎస్ అధికారి  ఉమేష్‌కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement