సుప్రీంలో సహారా చీఫ్కు చుక్కెదురు | Supreme Court dismisses plea of Sahara Chief Subrata Roy | Sakshi
Sakshi News home page

సుప్రీంలో సహారా చీఫ్కు చుక్కెదురు

Jun 4 2014 2:50 PM | Updated on Sep 2 2018 5:20 PM

సుప్రీంలో సహారా చీఫ్కు చుక్కెదురు - Sakshi

సుప్రీంలో సహారా చీఫ్కు చుక్కెదురు

తనను గృహనిర్బంధంలో ఉంచాలన్న సుబ్రతా రాయ్ విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది.

న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతా రాయ్కు మళ్లీ చుక్కెదురైంది. తనను గృహనిర్బంధంలో ఉంచాలన్న సుబ్రతా రాయ్ విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. కాగా తొమ్మిది నగరాల్లో ఉన్న స్థిరాస్తులను విక్రయించడానికి కోర్టు సహారా గ్రూప్కు అనుమతిచ్చింది.

సహారా ఆస్తులకు సంబంధించి టైటిల్ డీడ్స్ అందజేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం సెబీని అదేశించింది. డబ్బు సమకూర్చుకోవడానికి సహారా ఆస్తులను విక్రయించనుంది. నిబంధనలకు విరుద్ధంగా సమీకరించిన వేల కోట్ల నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించని వివాదంలో.. సుబ్రతా రాయ్‌తో పాటు మరో ఇద్దరు డెరైక్టర్లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుబ్రతా రాయ్కు బెయిల్ మంజూరు కాకపోవడంతో తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement