తాజ్‌మహల్‌ మాదే: షాజహాన్‌ విల్లు ఉందా ?

UP Sunni Waqf Board says Shah Jahan gave it Taj Mahal ownership, SC demands to see documents - Sakshi

న్యూఢిల్లీ: మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించిన ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ తమకే చెందుతుందని ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు షాజహాన్‌ అప్పట్లో వక్ఫ్‌నామాను తమకు అనుకూలంగా జారీచేశారని తెలిపింది. వాదనలు విన్న కోర్టు షాజహాన్‌ సంతకంతో జారీచేసిన పత్రాలను వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది.

తాజ్‌ హక్కులపై యూపీ సున్నీ వక్ఫ్‌ బోర్డు, భారత పురావస్తు శాఖల మధ్య కేసు నడుస్తోంది. తాజ్‌ తమ పేరిట రిజిస్టర్‌ చేయాలని వక్ఫ్‌ బోర్డు ఉత్తర్వులు జారీచేయగా దాన్ని సవాలుచేస్తూ భారత పురావస్తు శాఖ 2010లో సుప్రీంలో కేసు వేసింది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ మిశ్రా స్పందిస్తూ..  1658లో గృహనిర్బంధంలో ఉన్న షాజహాన్‌ తాజ్‌ హక్కుల్ని ఎలా రాసిచ్చారని వక్ఫ్‌ లాయర్‌ను ప్రశ్నించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top