పాఠశాలలో ప్రిన్సిపాల్‌ రాసలీలలు.. దేహశుద్ది

Students Thrash Principal Over Illicit Affair Women Employee - Sakshi

భువనేశ్వర్‌: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే తప్పటడుగులు వేస్తున్నారు. సరస్వతి నిలయంలాంటి పాఠశాలలను బూతు కార్యక్రమాలకు అడ్డాగా మారుస్తున్నారు. స్కూల్‌లో పనిచేస్తున్న సహచర ఉద్యోగినితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ఓ ప్రిన్సిపాల్‌కి విద్యార్థులు దేహశుద్ది చేశారు. వివరాలు.. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా హసన్‌పూర్‌ గ్రామంలోని రెసిడెన్సియల్‌ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజీవ్‌ లోచన్‌.. సహ ఉద్యోగి సబితా బిస్వాల్‌తో గత కొంతకాలంగా అక్రమ సంబంధం నేరుపుతున్నాడు. అంతటితో ఆగకుండా పాఠశాల ఆవరణలోనే ఆసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

దీంతో పాఠశాలలో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఒకసారి హెచ్చరించి వెళ్లారు. అయినప్పటికీ వారు బుద్ధి మార్చుకోకపోవడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  పాఠశాల వాతావరణాన్ని చెడగొడుతున్న వారిద్దరినీ సస్పెండ్‌ చేయాలంటూ తొలుత విద్యార్థులు ఆందోళకు దిగారు. ఈ సమయంలోనే గ్రామస్థులంతా అక్కడికి చేరుకోవడంతో రాజీవ్‌పైకి దాడికి దిగారు. అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారి వ్యవహారంపై విచారణ జరపుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top