ఇంజనీర్ను కిడ్నాప్ చేసింది విద్యార్థులే!


అసోం: అసోంలో ఇంజినీర్ను కిడ్నాప్ చేసింది విద్యార్థులేనని పోలీసులు తేల్చారు. అసోం విశిష్ట కనస్ట్రక్షన్  కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న నాగమల్లేశ్వరరావును బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసినట్లుగా తొలుత భావించారు. కాగా, ఆ ఇంజనీర్ ను కిడ్నాప్ చేసింది ఆ సంస్థ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. ఈ నెల 17న ఇంజనీర్ అపహరణకు గురయ్యారు. ప్రస్తుతం కిడ్నాపర్ల తల్లిదండ్రులు పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన నాగమల్లేశ్వరరావును సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై  అసోం సీఎస్, డీజీపీలతో కృష్ణారావు మాట్లాడారు. ఇంజినీర్‌ విడుదలకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. నాగమల్లేశ్వరరావును రేపు మధ్యాహ్నానికి  విడిపించి తెస్తామని పోలీసులు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top