క్లాస్మేట్పై ఇంటర్ విద్యార్థి కాల్పులు | Student injured in school shooting | Sakshi
Sakshi News home page

క్లాస్మేట్పై ఇంటర్ విద్యార్థి కాల్పులు

Jun 22 2016 1:13 PM | Updated on Sep 4 2017 3:08 AM

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి తన స్నేహితుడిపై కాల్పులు జరిపాడు. దాంతో అతడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు.

జంషెడ్ పూర్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి తన స్నేహితుడిపై కాల్పులు జరిపాడు. దాంతో అతడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. కాల్పులు జరిపి పారిపోతుండగా సెక్యూరిటీ గార్డు ఆ విద్యార్థిని వెంబడించి పట్టుకున్నాడు. దీంతో అతడిని కాలేజీ యాజమాన్యం పోలీసులకు అప్పగించింది. బుధవారం ఉదయం కాలేజీలో ఓ సమావేశానికి హాజరవడానికి ముందు విద్యార్థులంతా క్లాస్ రూంలో కూర్చున్నారు.

ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులు పక్కపక్కనే కూర్చున్నారు. అలా కూర్చున్న కొద్దిసేపటికే అవాక్కయ్యేలా తన వద్ద ఉన్న రివాల్వర్ తీసుకొని పక్కనే ఉన్న విద్యార్థిపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో క్లాస్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకీని స్వాధీనం చేసుకొని పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎందుకు ఇలా చేశాడో అనే విషయాన్ని వాకబు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement