ఢిల్లీలోనూ అవతరణోత్సవాలు: జితేందర్‌రెడ్డి | stateformation celebrations will held in delhi, says jitendarreddy | Sakshi
Sakshi News home page

ఢిల్లీలోనూ అవతరణోత్సవాలు: జితేందర్‌రెడ్డి

May 30 2015 2:15 AM | Updated on Aug 9 2018 8:30 PM

ఢిల్లీలోనూ అవతరణోత్సవాలు: జితేందర్‌రెడ్డి - Sakshi

ఢిల్లీలోనూ అవతరణోత్సవాలు: జితేందర్‌రెడ్డి

ఢిల్లీలోనూ తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు నిర్వహించనున్నట్టు టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనాయకుడు ఏపీ జితేందర్‌రెడ్డి తెలిపారు.

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోనూ తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు నిర్వహించనున్నట్టు టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనాయకుడు ఏపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించి ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో జితేందర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు డా.వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను చాటేలా మొత్తం 6 రోజులపాటు ఈ వేడుకలు ఉంటాయని, ఢిల్లీ వాసులకు సైతం తెలంగాణ వంటకాలు రుచి చూపిస్తామని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం సీఎం 18 నుంచి 20 గంటలు కష్టపడుతున్నారని కొనియాడారు.

Advertisement
 
Advertisement
Advertisement