'స్టార్టప్స్ అంటే ఐటీ పరిశ్రమలే కాదు' | Start Ups Not Only About IT, Many Options There, say pm modi | Sakshi
Sakshi News home page

'స్టార్టప్స్ అంటే ఐటీ పరిశ్రమలే కాదు'

Jan 31 2016 1:02 PM | Updated on Oct 9 2018 4:36 PM

'స్టార్టప్స్ అంటే ఐటీ పరిశ్రమలే కాదు' - Sakshi

'స్టార్టప్స్ అంటే ఐటీ పరిశ్రమలే కాదు'

'స్టార్టప్స్' అంటే ఐటీ పరిశ్రమలకు చెందినవేనన్న దురభిప్రాయాన్ని తాము దూరం చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: 'స్టార్టప్స్' అంటే ఐటీ పరిశ్రమలకు చెందినవేనన్న దురభిప్రాయాన్ని తాము దూరం చేశామని, తమ ప్రభుత్వం తీసుకొచ్చిన 'స్టార్టప్ ఇండియా' పథకంలో అన్ని రంగాల్లోనూ అంతులేని అవకాశాలు లభిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. 'మన్‌ కీ బాత్‌' 16 ఎడిషన్ రేడియో కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం దేశ ప్రజలతో ముచ్చటించారు. 'స్టార్టప్ ఇండియా' ద్వారా దేశ యువతలో కొత్త ఉత్సాహం, శక్తిని నింపామని ఆయన అన్నారు.

దేశంలోని లక్షలాది మంది ప్రజలకు ఖాదీ పరిశ్రమ  ఉపాధి కల్పిస్తుందని, దేశ ప్రయోజనాలు, యువత ఆకాంక్షలకు ఇది ప్రతీకగా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ప్రతి ఒక్కరూ ఒక జత ఖాదీ దుస్తులను కొనుగోలు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. 'మన్‌ కీ బాత్' కార్యక్రమం ప్రారంభంలో గాంధీజీకి నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా దేశ ప్రజలను మోదీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement