బట్టలు విప్పించి తనిఖీ చేశారు

Spicejet air hostess alleges strip search by the airline security staff - Sakshi

స్పైస్‌జెట్‌ సంస్థపై ఎయిర్‌హోస్టెస్‌ల ఆరోపణ  

టీ.నగర్‌(చెన్నై): విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ వివాదంలో చిక్కుకుంది. విమానం దిగగానే తమను స్పైస్‌జెట్‌ భద్రతాసిబ్బంది దుస్తులు విప్పించి తనిఖీలు చేస్తున్నారని ఎయిర్‌హోస్టెస్‌లు ఆరోపించారు. ప్రయాణికులకు ఆహారపదార్థాల విక్రయాల ద్వారా వచ్చిన నగదును కాజేస్తున్నామన్న అనుమానంతో ఈ తనిఖీలు చేస్తున్నారన్నారు.

భద్రతా సిబ్బంది తనిఖీల పేరిట తమను అభ్యంతరకరంగా తాకుతున్నారనీ, ఇది అత్యాచారం, వేధింపులకు ఏమాత్రం తక్కువకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చెన్నై ఎయిర్‌పోర్టులో శనివారం ఎయిర్‌హోస్టెస్‌లు ఆందోళనకు దిగిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. నగదును కాజేసిన సిబ్బంది కొందరు ఈ తనిఖీల్లో దొరికిపోయారనీ, వారిపై చర్యలు తీసుకుంటామని స్పైస్‌జెట్‌ పేర్కొంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top