కారు ఇలా.. మనుషులెలా? | speeding car hits stationary vehicle, 6 people dead | Sakshi
Sakshi News home page

కారు ఇలా.. మనుషులెలా?

Jun 3 2016 8:38 AM | Updated on Aug 14 2018 3:22 PM

ఢిల్లీలోని అలీపూర్ సమీపంలో జీటీ కర్నాల్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.

ఢిల్లీలోని అలీపూర్ సమీపంలో జీటీ కర్నాల్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. అత్యంత వేగంగా వెళ్తున్న ఫార్చూనర్ కారు ఆగి ఉన్న మరో వాహనాన్ని ఢీకొందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఫార్చూనర్ కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారు ముందుభాగంతో పాటు వెనక సీట్ల వద్ద కూడా పరిస్థితి భయానకంగా మారింది.

సాధారణంగా ఫార్చూనర్ లాంటి పెద్ద కార్లు ఒక మాదిరి ప్రమాదాలను సులభంగానే తట్టుకుంటాయి. కానీ ఈ కారు పరిస్థితి చూస్తుంటే మాత్రం అతి వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొందని చెబుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం ఇంకా తెలియలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని అదనపు డీసీపీ పంకజ్ కుమార్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement