రిటైర్డ్ ఎస్పీ దంపతుల ఆత్మహత్య? | SP, wife found dead at home Tirunelveli | Sakshi
Sakshi News home page

రిటైర్డ్ ఎస్పీ దంపతుల ఆత్మహత్య?

Jan 30 2016 4:46 PM | Updated on Jul 27 2018 2:18 PM

చెన్నైలో తిరునవ్వేలిలో మాజీ ఎస్పీ మరియప్పన్ (66) ఆయన భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందా

చెన్నై:  తమిళనాడులోని తిరునవ్వేలిలో మాజీ ఎస్పీ  మరియప్పన్ (66), ఆయన భార్య సుందరి  అనుమానాస్పద  స్థితిలో  మృతి చెందారు. పలాయం కొట్టాయంలోని తమ నివాసంలో వారు చనిపోయి ఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు  పోలీసులకు సమాచారం అందించారు.


సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరియప్పన్ దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని  ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  చెన్నైలో ఉంటున్న వారి కుమార్తెకు, ఇతర బంధువులకు సమాచారం అందించారు. జర్మనీలో ఉంటున్న వారి కొడుకు ఈ మధ్యనే  చెన్నై వచ్చినట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement