హాలిడే టైమ్‌: గోవాలో సోనియా | Sonia Gandhi holidays in Goa as son Rahul takes charge of Congress | Sakshi
Sakshi News home page

హాలిడే టైమ్‌: గోవాలో సోనియా

Dec 28 2017 11:45 AM | Updated on Oct 22 2018 9:16 PM

Sonia Gandhi holidays in Goa as son Rahul takes charge of Congress - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: పార్టీ చీఫ్‌గా కుమారుడు రాహుల్‌కు పగ్గాలు అప్పగించిన ఏఐసీసీ మాజీ చీఫ్‌ సోనియా గాంధీ గోవాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీర్ఘకాలం కాంగ్రెస్‌ అధినేత్రిగా పార్టీ వ్యవహారాల్లో మునిగితేలిన సోనియా ప్రస్తుతం రిలాక్స్‌ మోడ్‌లో ఉన్నారు. దక్షిణ గోవాలోని ఓ రిసార్ట్‌లో సేదతీరుతున్న సోనియా జనవరి తొలివారంలో తిరిగి ఢిల్లీ చేరుకుంటారని భావిస్తున్నారు.

గోవా రిసార్ట్‌లో బస చేసిన సోనియా అతిధులతో ముచ్చటిస్తూ అక్కడి బీచ్‌ల్లో సైక్లింగ్‌ చేస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సోనియాతో పలువురు సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలూ నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

సోనియా విశ్రాంతి తీసుకుంటున్నవేళ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ పలు కార్యక్రమాలతో బీజీ అయ్యారు. పార్టీ వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన బీజేపీ టార్గెట్‌గా విమర్శల దాడి పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement