మరిదిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సోనాలి

Sonali Phogat Files Complaint Against Sister And Brother In Law - Sakshi

చండీగఢ్‌ : టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలి ఫోగట్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. తన సోదరి, మరిదిపై  సోనాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తన సోదరి రుకేష్‌, మరిది అమన్‌ పుణియాలు తనను చంపుతానని బెదిరించారని సోనాలి ఆరోపించారు.

వివరాల్లోకి వెళితే.. సోనాలి మంగళవారం తన స్వగ్రామం భూతాన్ కలాన్‌కు వెళ్లారు. ఆ రోజు రాత్రి పలువురు బీజేపీ నాయకులు ఆమెను కలిశారు. అలాగే సోనాలి సోదరి, మరిది కూడా అక్కడికి వచ్చారు. అక్కడ వారు సోనాలితో గొడవకు దిగారు. ఈ సమయంలో వారు తనను దూషించడంతో పాటు.. చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారని సోనాలి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసు అధికారులు స్పందిస్తూ.. సోనాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్‌ చేసి.. విచారణ చేపడతామన్నారు. కాగా, ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అధంపూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన సోనాలి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top