నివేదిక వచ్చిన తర్వాతే స్పందిస్తా: స్మృతీ | Smriti Irani Responds On HCU Student Rohit suicide | Sakshi
Sakshi News home page

నివేదిక వచ్చిన తర్వాతే స్పందిస్తా: స్మృతీ

Jan 19 2016 12:47 PM | Updated on Nov 6 2018 7:56 PM

నివేదిక వచ్చిన తర్వాతే స్పందిస్తా: స్మృతీ - Sakshi

నివేదిక వచ్చిన తర్వాతే స్పందిస్తా: స్మృతీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంశం రాష్ట్రానికి చెందిన వ్యవహరమని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంశం రాష్ట్రానికి చెందిన వ్యవహారమని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్యపై మంగళవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. విద్యార్థి ఆత్మహత్యపై ద్విసభ్య కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే తాను ఈ అంశంపై స్పందిస్తానని చెప్పారు. అప్పటి వరకు తాను ఈ అంశంపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని  స్మృతీ ఇరానీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement