'మీ సాయం మిమ్మల్ని చూసి మరింత గర్వపడేలా చేస్తోంది'

Smriti Irani Praises Sonu Sood - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతండగా వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. సొంతూళ్లకు వెళ్లేందుకు అనేక కష్టాలు పడుతున్నారు. జాతీయ రహదారులపై ఎక్కడా చూసిని వేలాది మంది ఇళ్లకు చేరేందుకు పడుతున్న కష్టాలే కనిపిస్తాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ తన ఉదారతను చాటుకుంటున్న విషయం తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్ రాష్ట్రాల‌కు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసి వారికి అండ‌గా నిల‌బ‌డుతున్నారు. అతను చేస్తున్న సహాయ కార్యక్రమాలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసల వర్షం కురిపించారు. చదవండి: వలస కార్మికులను తరలిస్తున్న సోనూసూద్‌

దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పేదలను ఆదుకునేందుకు తనుపడుతున్న తపనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీరు నటుడిగా ఎప్పుడో చాలా ఎత్తుకు ఎదిగారు. మీతో వృత్తి పరంగా మీతో నాకు రెండు దశాబ్ధాల పరిచయం. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చేస్తున్న ఈ సహాయం మిమ్మల్ని చూసి మరింత గర్వపడేలా చేస్తోంది అని అన్నారు. కాగా గతంలో ఓ వ్యక్తి సోషల్‌ మీడియా వేదికగా యూపీలోని తన గ్రామానికి వెళ్లడానికి సాయం కోసం అభ్యర్థించగా.. అతనిని ఫోన్‌ నెంబర్‌ ద్వారా సంప్రదించి సహాయ అందించిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రి గుర్తుచేశారు. చదవండి: సిక్కిం మ‌రో దేశంగా ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top