శ్రీనగర్‌లో ఆరుగురు ఉగ్రవాదుల హతం | Six Terrorists Killed In Anantnag Encounter Operation Underway | Sakshi
Sakshi News home page

Nov 23 2018 9:12 AM | Updated on Nov 23 2018 11:42 AM

Six Terrorists Killed In Anantnag Encounter Operation Underway - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రత బలగాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. శ్రీనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో బీజబెరా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇంకా ఈ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతుంది. మృతి చెందిన ఉగ్రవాదుల వద్ద నుంచి భారీగా ఆయుధాలతో పాటు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిని ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా అధికారులు పేర్కొంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement