వివాహ వేడుకలో విషాదం | Six killed in cylinder blast in east Delhi | Sakshi
Sakshi News home page

వివాహ వేడుకలో విషాదం

Oct 11 2014 12:57 AM | Updated on Sep 2 2017 2:38 PM

వివాహ వేడుకలో విషాదం

వివాహ వేడుకలో విషాదం

వివాహ సంబరాలు జోరుగా జరుగుతున్నాయి. మగపెళ్లివారు, ఆడపెళ్లివారు ముచ్చట్లు చెప్పుకుంటూ, కనపడిన బంధువులందరినీ పలకరించుకుంటూ హాయిగా నవ్వుకుంటున్నారు.

* సిలిండర్ పేలి వ్యాపించిన మంటలు   
* ఆరుగురి సజీవ దహనం

సాక్షి, న్యూఢిల్లీ: వివాహ సంబరాలు జోరుగా జరుగుతున్నాయి. మగపెళ్లివారు, ఆడపెళ్లివారు ముచ్చ ట్లు చెప్పుకుంటూ, కనపడిన బంధువులందరినీ పలకరించుకుంటూ హాయి గా నవ్వుకుంటున్నారు. అయితే అంతలోనే ఈ ఆనందం కాస్తా ఆవిరైపోయింది. అసలేమి జరిగిందంటే... పెళ్లివారి ఇంటిలో గ్యాస్ సిలిం డర్ పేలడంతో ఆరుగురు మరణించారు. జసోలా గ్రామంలోని మసీదువాలీ గల్లీలో సి -13 ఇంటి సభ్యులంతా శుక్రవారం ఉదయం పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్నారు.

అంతలోనే ఉదయం 11 గంటల సమయంలో ఎల్‌పీజీ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయి.  ఆ సమయంలో అదే ఇంట్లో ఉన్న ముగ్గురు  మహిళలు, ముగ్గురు పిల్లలు అగ్నికీలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో మహిళలు, పిల్లలు మాత్రమే ఉన్నారు.

మిగతా వారంతా బారాత్ కోసం బయటకు వెళ్లారు. మంటలు పొరుగున ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించాయని, వీధులన్నీ ఇరుగ్గా ఉండడంతో మంటలను ఆర్పడానికి అవస్థపడాల్సి వచ్చిందనిఅగ్నిమాపక విభాగం తెలిపింది. కాగా క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందగానే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటి పరిసరాలను దిగ్బంధించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement