రాహుల్ గాంధీకి చేదు అనుభవం | Shoe hurled at Rahul Gandhi during his road show at Sitapur | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీకి చేదు అనుభవం

Sep 26 2016 2:45 PM | Updated on Oct 9 2018 5:39 PM

రాహుల్ గాంధీకి చేదు అనుభవం - Sakshi

రాహుల్ గాంధీకి చేదు అనుభవం

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం చేదు అనుభవం ఎదురైంది.

సీతాపూర్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ప్రదేశ్ సీతాపూర్లో రోడ్ షో నిర్వహిస్తున్న రాహుల్ గాంధీపై ఓ ఆగంతకుడు చెప్పు విసిరాడు. ఓపెన్ టాప్ జీపుపై ర్యాలీగా వెళుతున్న ఆయనపై దుండగుడు షూ విసరగా, అది కాస్త రాహుల్ తలకు తగిలింది.

కాగా ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరిపారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంత‌రం మ‌ళ్లీ రాహుల్ గాంధీ త‌న రోడ్ షోను కొన‌సాగించారు. కాగా షూ విసిరిన వ్యక్తి జర్నలిస్ట్ అనూప్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు.  కాగా వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ రాష్ట్రవ్యాప్తంగా  కిసాన్ యాత్ర చేపట్టిన  విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement