షాకింగ్ సీసీ కెమెరా వీడియో | Shocking footage of 4 men assaulting man for asking 'bidi' | Sakshi
Sakshi News home page

షాకింగ్ సీసీ కెమెరా వీడియో

Feb 5 2016 11:32 AM | Updated on Oct 9 2018 5:39 PM

షాకింగ్ సీసీ కెమెరా వీడియో - Sakshi

షాకింగ్ సీసీ కెమెరా వీడియో

ఫరీదాబాద్ లో ఓ వ్యక్తిని అమానుషంగా కొట్టి అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చండీఘడ్: హర్యానాలోని ఫరీదాబాద్ లో ఓ వ్యక్తిని అమానుషంగా కొట్టి అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ టీవీలో రికార్డయిన ఈ షాకింగ్ దృశ్యాలు పలువురిని దిగ్భ్రాంతికి గురి చేశాయి.  

మితిమీరిన ఆవేశంలో నలుగురు వ్యక్తులు ఉన్మాదుల్లా మారిపోయారు. ఆ వ్యక్తిని పట్టుకుని పిడిగుద్దులు కురిపించారు. నిస్సహాయుడిని చేసి బెల్ట్తో విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. కిందపడిపోయిన అతనిపై  మూత్రం పోసి  హేయంగా ప్రవర్తించారు.

సీసీ  కెమెరాలో రికార్డయిన ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు ఏడు నిమిషాలు పాటు వీరి అకృత్యం కొనసాగింది. బీడీ అడిగిన పాపానికి అతడిని దారుణంగా హింసించి, అవమానించినట్టు తెలుస్తోంది. అయితే బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement