breaking news
Shocking footage
-
9/11కు 25 ఏళ్లు.. అల్‌ఖైదా సంచలన వీడియో!
అమెరికా సెప్టెంబర్ 11 దాడులకు పాతికేళ్లు పూర్తయిన వేళ అల్‌ఖైదా విడుదల చేసిన ఓ వీడియో సంచలనం రేపుతోంది. ఆ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు లాడెన్ కొడుకు హమ్జా అందులో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏడేళ్ల కిందటే.. అమెరికా ఆపరేషన్‌లో అతను హతమైనట్లు ఇంతకాలం అంతా భావించారు. అయితే ఇప్పుడు వీడియో ద్వారా అల్‌ఖైదా ఏం సందేశం ఇచ్చిందనే దానిపై ఆసక్తి నెలకొంది.అల్‌ఖైదా మీడియా విభాగం ‘అస్-సహాబ్’ 50 నిమిషాల వీడియో రిలీజ్ చేసింది. అందులో హమ్జా కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ఏడేళ్ల క్రితం ముగిసిందనుకున్న అతడి కథపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ‘ఎ క్వార్టర్ సెంచరీ ఆఫ్ ది 11 సెప్టెంబర్ రైడ్స్’ పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు. ఇందులో హమ్జా బిన్ లాడెన్‌తో పాటు 2022లో అమెరికా ఆపరేషన్‌లో హతమైన అల్‌ఖైదా చీఫ్ అయ్మన్ అల్-జవహిరి దృశ్యాలు కూడా ఉన్నారు.వీడియోలో హమ్జా తెల్లటి తలపాగా ధరించి, పక్కనే తుపాకీ ఉండగా మట్టి గోడ ముందు కూర్చుని కనిపిస్తాడు. అతడిని ఒసామా బిన్ లాడెన్ వారసుడిగా చూపించేలా ఈ దృశ్యాలను రూపొందించినట్లు భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బిన్ లాడెన్ పేరును ఉపయోగించుకోవడం ద్వారా అల్‌ఖైదా తన భావజాలాన్ని ప్రచారం చేయడంతోపాటు కొత్తగా మద్దతుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.Al-Qaeda Releases New Video Featuring Hamza Bin Laden On 9/11 AnniversaryAl-Qaeda’s media arm, As-Sahab, has released a 52-minute propaganda video marking the 25th anniversary of the September 11 attacks, featuring previously unseen footage of Hamza bin Laden, the son of…1️⃣ pic.twitter.com/7uL3VYjKEx— Aamaj News English (@aamajnews_EN) September 11, 20262019లో ఏం జరిగింది?ఒసామా బిన్ లాడెన్ కుమారుడైన హమ్జా.. అల్‌ఖైదా భవిష్యత్ నాయకుడిగా ఎదుగుతున్నాడని అప్పట్లో అమెరికా నిఘా వర్గాలు భావించాయి. తండ్రి మరణం తర్వాత అల్‌ఖైదా ప్రచార వీడియోలు, ఆడియో సందేశాల్లో అతడి పేరు తరచూ వినిపించింది. దీంతో అతడు సంస్థకు కీలక నేతగా మారే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి.అయితే 2019 ఫిబ్రవరిలో హమ్జా ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. అదే ఏడాది.. అనూహ్యంగా ఓ ఆపరేషన్‌లో అతను మరణించినట్లు అమెరికా ప్రకటించింది. అయితే హమ్జా మృతిని అల్‌ఖైదా అధికారికంగా ప్రకటించకపోవడం అప్పట్లోనే ఆసక్తి రేపింది. సాధారణంగా కీలక నేతలు మరణించినప్పుడు సంతాప ప్రకటనలు చేసే సంస్థ.. హమ్జా విషయంలో అలాంటి ప్రకటన చేయలేదు.తాజాగా విడుదలైన వీడియోలో హమ్జా కనిపించడం అతడు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడా? అనేది నిర్ధారణ కాలేదు. పైగా ఆ ఫుటేజ్ ఎప్పుడు చిత్రీకరించారన్నది తెలియదు. అతడి మరణానికి ముందు తీసిన పాత దృశ్యాలను ఇప్పుడు ప్రచార వీడియోలో ఉపయోగించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. 2025లోనూ హమ్జా బతికే ఉన్నాడంటూ కొన్ని నివేదికలు వెలువడ్డాయి.కరాచీ దాడి దృశ్యాలతో మొదలువీడియో ఫుటేజీలో.. 2014లో పాకిస్థాన్‌లోని కరాచీ నేవల్ డాక్యార్డ్పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలతో ప్రారంభమైనట్లు సమాచారం. అనంతరం హమ్జా పలుమార్లు కనిపిస్తాడు. పాకిస్థాన్ కేంద్రంగా అల్‌ఖైదా కార్యకలాపాలు, ప్రచార వ్యవస్థకు ఉన్న సంబంధాన్ని నొక్కిచెప్పేలా ఈ ఫుటేజ్‌ను ఎంచుకున్నట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. హమ్జా పేరును మళ్లీ తెరపైకి తీసుకురావడం వెనుక అల్‌ఖైదా వ్యూహం కూడా ఇదేనని విశ్లేషిస్తున్నారు. ఒసామా బిన్ లాడెన్ వారసుడిగా అతడికి ఉన్న పాత ఇమేజ్ను ఉపయోగించి సంస్థ భావజాలాన్ని కొత్త తరానికి చేరవేసే ప్రయత్నంగా దీన్ని చూస్తున్నారు.ముఖ్యంగా 9/11 దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలోనే ఈ వీడియో విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2001 సెప్టెంబర్ 11న అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పావు శతాబ్దం తర్వాత కూడా ఆ సంస్థ తన పాత నాయకులు, వారి వారసత్వాన్ని ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: షరీఫ్ ఇంట పెళ్లి సందడి.. పాక్ జనాల్లో కొత్త భయాలు -
గాలుల ధాటికి ఊగిపోయిన విమానం
బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన జెట్ విమానం గాలి ధాటికి విలవిల్లాడింది. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం బీఏ 492 ఇబ్బందుల్లో పడింది. 180మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం గాలి తీవ్రతకు అటూ ఇటూ ఊగిసలాడి పోయింది. అన్ని వాతావరణ పరిస్థితులకు తగినట్టు పైలట్లు శిక్షణ పొందినప్పటికీ, గాలుల ధాటికి భయపడిన పైలెట్ వెంటనే అప్రమత్తమై అధికారులను సంప్రదించారు. వారి ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని స్పెయిన్‌లోని మాలికి దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది. జిబ్రాల్టర్‌లో విమానాశ్రయం ల్యాండ్ అవుతుండగగా సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై బ్రిటీష్ ఎయిర్వేస్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. British Airways flight #BA492 flight from London Heathrow has diverted to Malaga due to strong winds at Gibraltar Airport. (C📹@RockRadio)pic.twitter.com/cywE2OpA1N — Flight Alerts (@FlightAlerts_) February 25, 2019 -
మహిళ అని కూడా చూడకుండా కార్పొరేటర్ ఘాతుకం
-
కార్పొరేటర్ ఘాతుకం
సాక్షి, చెన్నై : ప్రజల మంచి చెడులు చూడాల్సిన ఓ రాజకీయనాయకుడు, మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా దాడికి దిగాడు. తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. సీసీటీవీ కెమెరాలో రికార్డైన దాడి దృశ్యాలు సామాజికమాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. డీఎంకే కార్పొరేటర్ సెల్వకుమార్‌కు బ్యూటీపార్లర్ యజమాని సత్యకు మధ్య మే25న తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన సెల్వకుమార్ ఆమెను దూషిస్తూ తీవ్రంగా కొట్టాడు. పక్కనే ఉన్న మహిళలు ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఆగకుండా కిందపడేసి కాలుతో ఇష్టానుసారంగా తన్నాడు. వీడియో ఆధారంగా సెల్వకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎంకే పార్టీ అధినాయకత్వం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. -
బ్యాంకులో కవాతు చేసి సైనికుల స్టైల్లో దోచారు
సార్డినియా: ఇప్పటి వరకు చాలా దొంగతనాల గురించి విన్నాం. ఒక్కో దొంగది ఒక్కో స్టైల్.. సాధరణంగా దొంగతనాలకు వచ్చే వారంతా లోపలికి రాగానే కత్తులుకటార్లు చూపించి దొంగతనాలకు పాల్పడుతుంటారు. తిరగబడితే హంతకులుగా మారుతారు. అడ్డగోలుగా దొంగతనం చేయడంలో నైపుణ్యం చూపిస్తారే తప్ప క్రమశిక్షణ మాత్రం ఉండదు. అయితే, సర్దినియా దొంగలు మాత్రం క్రమశిక్షణగల సైనికులుగా వ్యవహరించారు. ఓ బ్యాంకును దోచుకునేందుకు వచ్చినవారంతా సైనికుల్లాగా మారిపోయి సైనికుల్లాగా టెక్నిక్స్ ఉపయోగించారు. సార్డినియాలోని ఓ బ్యాంకులోకి చొరబడినవారు వెంటనే బ్యాంకులో వాళ్లందరినీ కదిలితే కాల్చిపారేస్తామని, అంతా నేలపై కదలకుండా పడుకోవాలని ఆదేశించారు. ఆయుధాలతో నింపిన వాహనాన్ని ఏకంగా బ్యాంకు లోపలికి తీసుకొచ్చారు. ఆ వెంటనే అందులో నుంచి కుప్పలుగా సాయుధులు దిగి బ్యాంకులో సైనికుల్లాగా మార్చ్ నిర్వహించారు. ఉగ్రవాదులను తుదముట్టించే సైనికుల శైలిలో ముందుకు కదులుతూ బ్యాంకులో ఉన్నదంతా దోచుకెళ్లారు. ఈ సమయంలో బ్యాంకు ఉద్యోగులంతా లొంగిపోయిన ఉగ్రవాదుల మాదిరిగా నేలపై కిక్కురుమనకుండా పడుకున్నారే తప్ప ఏం చేయలేకపోయారు. ఆ దొంగలను పట్టుకునేందుకు తాజాగా పోలీసు అధికారులు ఈ వీడియోను విడుదల చేశారు. -
షాకింగ్ సీసీ కెమెరా వీడియో
చండీఘడ్: హర్యానాలోని ఫరీదాబాద్ లో ఓ వ్యక్తిని అమానుషంగా కొట్టి అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ టీవీలో రికార్డయిన ఈ షాకింగ్ దృశ్యాలు పలువురిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. మితిమీరిన ఆవేశంలో నలుగురు వ్యక్తులు ఉన్మాదుల్లా మారిపోయారు. ఆ వ్యక్తిని పట్టుకుని పిడిగుద్దులు కురిపించారు. నిస్సహాయుడిని చేసి బెల్ట్‌తో విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. కిందపడిపోయిన అతనిపై మూత్రం పోసి హేయంగా ప్రవర్తించారు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు ఏడు నిమిషాలు పాటు వీరి అకృత్యం కొనసాగింది. బీడీ అడిగిన పాపానికి అతడిని దారుణంగా హింసించి, అవమానించినట్టు తెలుస్తోంది. అయితే బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేదు. -
బాబును కాపాడుతున్న నాలుగు పాములు!
-
షేక్ చేస్తున్న షాకింగ్ వీడియో
పాము కనబడితే మనం అంతదూరం పరుగెడతాం. పామును చూడగానే పైన ప్రాణాలు పైనే పోతాయి. పాము పడగ విప్పిదంటే మనల్ని కాటేయడానికే వస్తుందని హడలిపోతాం. అలాంటిది ఏకంగా నాలుగు విషసర్పాలు ఓ బుడ్డోడు చుట్టూ చేరి పడగ విప్పి కాటేయకుండా వదిలాయంటే నమ్మగలరా. కాని ఇది నిజం. నులక మంచంపై నిద్రపోతున్న చిన్నారి వద్దకు నాలుగు కోబ్రాలు వచ్చాయి. రావడంతోనే పడగ విప్పాయి. బుడ్డోడు నిద్రలో వాటిని వాటేసుకున్నా ఏమీ చేయలేదు. అంతేకాదు ఆ నాలుగు సర్పాలు మంచానికి ఉన్న నాలుగు కోళ్లపై నిలబడి పహారా కాస్తున్నట్టు పడగ విప్పిన దృశ్యాలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. ఒళ్లు జలదరించే ఈ షాకింగ్ వీడియో అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది. ఇదెక్కడో విదేశాల్లో జరిగిన వింత కాదు మనదేశంలోని ఓ పల్లెటూర్లులో జరిగింది. అయితే పాము పడగ విప్పి రక్షణ ఛత్రంగా నిలబడిందంటే వాడు మామూలోడు కాదని, మహర్జాతకుడని వీడియో చూసిన వారు అంటున్నారు.


