
బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన జెట్ విమానం గాలి ధాటికి విలవిల్లాడింది. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం బీఏ 492 ఇబ్బందుల్లో పడింది. 180మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం గాలి తీవ్రతకు అటూ ఇటూ ఊగిసలాడి పోయింది. అన్ని వాతావరణ పరిస్థితులకు తగినట్టు పైలట్లు శిక్షణ పొందినప్పటికీ, గాలుల ధాటికి భయపడిన పైలెట్ వెంటనే అప్రమత్తమై అధికారులను సంప్రదించారు. వారి ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని స్పెయిన్‌లోని మాలికి దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్‌లో హల్ చల్ చేస్తోంది. జిబ్రాల్టర్‌లో విమానాశ్రయం ల్యాండ్ అవుతుండగగా సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై బ్రిటీష్ ఎయిర్‌వేస్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.
British Airways flight #BA492 flight from London Heathrow has diverted to Malaga due to strong winds at Gibraltar Airport. (C📹@RockRadio)pic.twitter.com/cywE2OpA1N
— Flight Alerts (@FlightAlerts_) February 25, 2019