బీఎంసీ కొత్త మేయర్ స్నేహల్ | Shiv Sena's Snehal Ambekar elected Mumbai's new mayor | Sakshi
Sakshi News home page

బీఎంసీ కొత్త మేయర్ స్నేహల్

Sep 9 2014 10:37 PM | Updated on Apr 3 2019 4:53 PM

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 73వ మేయర్‌గా శివసేన కార్పొరేటర్ స్నేహల్ అంబేకర్ మంగళవారం ఎన్నికయ్యారు.

ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 73వ మేయర్‌గా శివసేన కార్పొరేటర్ స్నేహల్ అంబేకర్ మంగళవారం ఎన్నికయ్యారు. ఇక బీజేపీకి చెందిన అల్కా కేర్కర్ ను ఉప మేయర్ పదవి వరించింది. భారతీయ జీవిత భీమా సంస్థ (ఎల్‌ఐసీ) మాజీ ఉద్యోగి అయిన స్నేహల్ నగరంలోని జీ-సౌత్ (పరేల్) వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు.

 ప్రస్తుత మేయర్ సునీల్ ప్రభు పదవీకాలం ముగియడంతో మంగళవారం ఉదయం బీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరిపారు. బీఎంసీలో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 226 కాగా  స్నేహల్‌కు అనుకూలంగా 121 మంది ఓటు వేశారు. ఈ పదవికోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీపడిన డాక్టర్ ప్రియతమకు కేవలం 64 ఓట్లే పడ్డాయి. ఇక డిప్యూటీ మేయర్‌గా అల్కా కేర్కర్ ఎన్నికయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement