'రాష్ట్రపతిగా అమితాబ్' | Shatrughan Sinha Pitches For Amitabh Bachchan As President | Sakshi
Sakshi News home page

'రాష్ట్రపతిగా అమితాబ్'

Mar 18 2016 8:20 PM | Updated on Sep 3 2017 8:04 PM

'రాష్ట్రపతిగా అమితాబ్'

'రాష్ట్రపతిగా అమితాబ్'

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను తదుపరి రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హా వ్యాఖ్యానించారు.

పట్నా: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను తదుపరి రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హా వ్యాఖ్యానించారు. అమితాబ్‌ను రాష్ట్రపతిని చేయడం మనందరికీ గర్వకారణమే అవుతుందన్నారు. సాంస్కృతిక, సామాజిక రంగాల్లో అమితాబ్ ఎన్నో మైలురాళ్లను దాటారని, రాష్ట్రపతి అయితే దేశానికి గొప్పపేరు తెస్తారని వ్యాఖ్యానించారు.

'రాష్ట్రపతి పదవికి గతంలో నా పేరును అమితాబ్ ప్రతిపాదించడం ఆయన గొప్పదనం'అని సిన్హా అన్నారు. రాజకీయాలను నుంచి ఇప్పుడప్పుడే రిటైర్ కాబోనని తెలిపారు. బీజేపీలోనే కొనసాగుతానని పునరుద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement