‘తేజో మహల్‌’ను ధ్వంసం చేసి తాజ్‌మహల్‌ కట్టారు! | Shah Jahan distroyed Tejo Mahal, build Taj Mahal, says BJP MP Vinay Katiyar | Sakshi
Sakshi News home page

‘తేజో మహల్‌’ను ధ్వంసం చేసి తాజ్‌మహల్‌ కట్టారు!

Oct 18 2017 4:14 PM | Updated on Oct 18 2017 4:24 PM

Shah Jahan distroyed Tejo Mahal, build Taj Mahal, says BJP MP Vinay Katiyar

తాజ్‌ పాత చిత్రం(ఇన్‌సెట్‌లోని వృత్తంలలో పేర్కొన్న ప్రదేశం గుండా శివాలయానికి దారి ఉందని ప్రచారంలో ఉంది.

లక్నో : ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిల ప్రకటనలతో ఇక తెరపడిందనుకున్న తాజ్‌మహల్‌ వివాదాన్ని బీజేపీ ఎంపీ వినయ్‌ కతియార్‌ మళ్లీ తిరగదోడే ప్రయత్నం చేశారు. తాజ్‌మహల్‌ను ఆ పేరుతో పిలవడానికే ఇష్టపడని ఆయన.. మొఘలులు హిందూ ఆలయాలను ధ్వసం చేశారని ఆరోపించారు. బుధవారం పలు జాతీయ మీడియా సంస్థలతో ఆయన మాట్లాడారు.

‘‘తేజో మహల్‌గా ప్రసిద్ధి చెందిన శివాలయాన్ని కూల్చేసి షాజహాన్‌ తాజ్‌మహల్‌ను కట్టాడు. ఇప్పటికీ అక్కడ ఆలయ అవశేషాలున్నాయి. తాజ్‌మహల్‌ పైకప్పు నుంచి జారిపడే నీటిధార అప్పట్లో శివలింగంపై పడేది’’ అని వినయ్‌ కతియార్‌ చెప్పుకొచ్చారు.

అయితే, తేజో మహల్‌ను ధ్వసం చేసి కట్టినంత మాత్రాన తాజ్‌ మహల్‌ను కూల్చేయాలని తాను అనబోనని, సీఎం ఆదిత్యనాథ్‌ ఆగ్రా పర్యటనను స్వాగతిస్తున్నానని ఎంపీ వినయ్‌ అన్నారు. తాజ్‌ మహల్‌ భారతీయ సాంస్కృతిక చిహ్నం కాబోదంటూ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలతో చారిత్రక కట్టడంపై మొదలైన వివాదం.. నానాటికీ పెద్దదవుతూ వచ్చింది. రెండు రోజుల కిందట బీజేపీ ఎంపీ సంగీత్‌ సోమ్‌.. తాజ్‌, ద్రోహులు నిర్మించిన కట్టడమని, బానిస నిర్మాణమని వ్యాఖ్యానించడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement