breaking news
vinay katiyar comments
-
‘తేజో మహల్’ను ధ్వంసం చేసి తాజ్‌మహల్ కట్టారు!
లక్నో : ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిల ప్రకటనలతో ఇక తెరపడిందనుకున్న తాజ్‌మహల్ వివాదాన్ని బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మళ్లీ తిరగదోడే ప్రయత్నం చేశారు. తాజ్‌మహల్‌ను ఆ పేరుతో పిలవడానికే ఇష్టపడని ఆయన.. మొఘలులు హిందూ ఆలయాలను ధ్వసం చేశారని ఆరోపించారు. బుధవారం పలు జాతీయ మీడియా సంస్థలతో ఆయన మాట్లాడారు. ‘‘తేజో మహల్‌గా ప్రసిద్ధి చెందిన శివాలయాన్ని కూల్చేసి షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టాడు. ఇప్పటికీ అక్కడ ఆలయ అవశేషాలున్నాయి. తాజ్‌మహల్ పైకప్పు నుంచి జారిపడే నీటిధార అప్పట్లో శివలింగంపై పడేది’’ అని వినయ్ కతియార్ చెప్పుకొచ్చారు. అయితే, తేజో మహల్‌ను ధ్వసం చేసి కట్టినంత మాత్రాన తాజ్ మహల్‌ను కూల్చేయాలని తాను అనబోనని, సీఎం ఆదిత్యనాథ్ ఆగ్రా పర్యటనను స్వాగతిస్తున్నానని ఎంపీ వినయ్ అన్నారు. తాజ్ మహల్ భారతీయ సాంస్కృతిక చిహ్నం కాబోదంటూ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలతో చారిత్రక కట్టడంపై మొదలైన వివాదం.. నానాటికీ పెద్దదవుతూ వచ్చింది. రెండు రోజుల కిందట బీజేపీ ఎంపీ సంగీత్ సోమ్.. తాజ్, ద్రోహులు నిర్మించిన కట్టడమని, బానిస నిర్మాణమని వ్యాఖ్యానించడం తెలిసిందే. -
నవ్వేసి ఊరుకున్న భార్య.. సారీ చెప్పాలన్న భర్త
తనపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు వినయ్ కతియార్‌ను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పెద్దగా పట్టించుకోలేదు గానీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా మాత్రం వాటిని సీరియస్‌గా తీసుకున్నారు. కతియార్ తప్పనిసరిగా క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ప్రియాంకను యూపీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా తాను భావించడం లేదని, ఆమెకంటే చాలామంది అందమైన మహిళలు, హీరోయిన్లు ఈసారి ప్రచారపర్వంలో ఉన్నారని కతియార్ అన్నారు. వాటిపై వాద్రా ఫేస్బుక్లో స్పందించారు. మహిళలను మనమంతా గౌరవించాలని, వారికి సమాన గౌరవం ఇవ్వాలని వాద్రా చెప్పారు. కతియార్ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే అంతకుముందు దీనిపై స్పందించిన ప్రియాంకా గాంధీ మాత్రం వాటిని తేలిగ్గా తీసిపారేశారు. వాళ్లు తనను నవ్వుకునేలా చేస్తున్నారని, కతియార్ వ్యాక్యలు మహిళలపై బీజేపీ ఆలోచనా విధానాన్ని బయట పెడుతున్నాయని కామెంట్ చేశారు. సారీ చెప్పను గాక చెప్పను.. అయితే, ఈ వ్యవహారంపై తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని బీజేపీ నాయకుడు వినయ్ కతియార్ స్పష్టం చేశారు. ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆయన ఆ ఒక్క సమాధానం మాత్రమే చెప్పి ఊరుకున్నారు.