యూపీలో ఘర్షణ.. 22 మంది మృతి | Seven killed in UP anti-encroachment drive | Sakshi
Sakshi News home page

యూపీలో ఘర్షణ.. 22 మంది మృతి

Jun 3 2016 6:42 AM | Updated on Aug 21 2018 5:54 PM

యూపీలో ఘర్షణ.. 22 మంది మృతి - Sakshi

యూపీలో ఘర్షణ.. 22 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో అక్రమ కట్టడాల కూల్చివేత వ్యవహారం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో...

* మృతుల్లో ఎస్పీ స్థాయి అధికారి సహా ఇద్దరు పోలీసులు
* అక్రమ కట్టడాల కూల్చివేత హింసాత్మకం

మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో అక్రమ కట్టడాల కూల్చివేత వ్యవహారం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఓ ఎస్పీస్థాయి అధికారితోపాటు మొత్తం 22 మంది మృతిచెందారు. 50 మందికి పైగా ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మధురలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గురువారం మథురలోని జవహార్ బాగ్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు కూల్చివేస్తుండగా ఆందోళనకారులు పోలీసులపైకి కాల్పులు జరిపారని ఐజీ శర్మ తెలిపారు.

ఈ ఆందోళనకారులంతా.. ‘ఆజాద్ భారత్ విధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ సంస్థకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. దాదాపు 3 వేల మంది అక్రమ నిర్మాణదారులు పోలీసులపైకి రాళ్లు విసిరేశారని, అనంతరం కాల్పులు జరిపారని తెలిపారు. రెండేళ్ల క్రితం బాబా జై గురుదేవ్ వర్గం నుంచి విడిపోయిన మరో వర్గానికి చెందిన వారు వందలాది ఎకరాలను ఆక్రమించారు. కాగా ఘటనపై కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement