చిదంబరానికి సుప్రీం షాక్‌ | Setback For Chidambaram In Sc Over Inx Case | Sakshi
Sakshi News home page

చిదంబరానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

Aug 26 2019 12:34 PM | Updated on Aug 26 2019 1:26 PM

Setback For Chidambaram In Sc Over Inx Case - Sakshi

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరానికి సర్వోన్నత న్యాయస్ధానంలో ఎదురుదెబ్బ తగిలింది. చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టు ఉత‍్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్‌ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. మరోవైపు సీబీఐ రిమాండ్‌ను సవాల్‌ చేస్తూ చిదంబరం న్యాయవాదులు ఎలాంటి పిటిషన్‌ దాఖలు చేయనందున దీనిపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ భానుమతి పేర్కొన్నారు. ఈ కేసులో చిదంబరంను అయిదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి తరలించగా నేటితో గడువు ముగిసింది. చిదంబరంను అరెస్ట్‌ చేయడం ద్వారా ఆయనకు సంక్రమించిన హక్కులను సీబీఐ కాలరాసిందని చిదంబరం తరపున వాదించిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ పేర్కొన్నారు. కోర్టు పరిధిలో విచారణ సాగుతున్న క్రమంలో సీబీఐ అత్యుత్సాహంతో ఆయనను అరెస్ట్‌ చేసిందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement