భగవత్ నిజమే చెప్పారు: శివసేన | Sena defends RSS chief's Teresa remarks | Sakshi
Sakshi News home page

భగవత్ నిజమే చెప్పారు: శివసేన

Feb 25 2015 9:24 AM | Updated on Sep 2 2017 9:54 PM

మదర్ థెరీసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్కు శివసేన పార్టీ బాసటగా నిలిచింది. ఆయన కొంత నిజమే చెప్పారని ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది.

మదర్ థెరీసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్కు శివసేన పార్టీ బాసటగా నిలిచింది. ఆయన కొంత నిజమే చెప్పారని ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. విదేశాలనుంచి మిషనరీలుగా వస్తున్న క్రైస్తవ సంస్థలు దేశంలో చాలామందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాయని శివసేన ఆ పత్రికలో వ్యాఖ్యానించింది.

 

ముస్లింలు కత్తితో బెదిరించి మత మార్పిడి చేస్తే.. క్రైస్తవులు డబ్బు, సేవల పేరిట మతమార్పిడిలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ ఆరోపించింది. అయితే, మనమంతా మదర్ థెరిసా సేవలను గుర్తించామని, ఆమెలాగే చాలామంది కూడా సేవలందించారని, కానీ ఎలాంటి మత మార్పిడిలకు దిగలేదని పేర్కొంది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement