అలాగైతే ఇప్పుడే చస్తా.. | Samajwadi Party Leader Azam Khan Comments On Ataljees Death | Sakshi
Sakshi News home page

అలాగైతే ఇప్పుడే చస్తా..

Aug 26 2018 11:11 AM | Updated on Aug 26 2018 12:31 PM

Samajwadi Party Leader Azam Khan Comments On Ataljees Death - Sakshi

లక్నో : సమాజ్‌వాది పార్టీ నేత ఆజం ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి అస్థికలశ్‌ యాత్రను ప్రస్తావించిన ఆజం ఖాన్‌ మరణించిన తర్వాత అంతటి గౌరవం ఇస్తామంటే తాను ఈ క్షణమే మరణిస్తానని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఎస్‌పీ నేత పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువయ్యాయి.

కాగా వాజ్‌పేయి అస్థికలను వారణాసిలో పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేశారు. బీజేపీ దిగ్గజ నేతకు వేలాది మంది నివాళులు అర్పించారు. దివంగత నేత అస్థికల యాత్రను బీజేపీ రాష్ట్ర శాఖలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. దేశంలోని 100 ప్రధాన నదులలో వాజ్‌పేయి అస్థికలను కలపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. మరోవైపు వాజ్‌పేయి మృతిపై రాజకీయంగా లబ్ధిపొందాలనే బీజేపీ హడావిడి చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement