ఇంటికి చేరుకున్న సల్మాన్ | salman khan returns to home | Sakshi
Sakshi News home page

ఇంటికి చేరుకున్న సల్మాన్

May 8 2015 6:58 PM | Updated on Sep 3 2017 1:40 AM

ఇంటికి చేరుకున్న సల్మాన్

ఇంటికి చేరుకున్న సల్మాన్

హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు నుంచి బెయిల్ పొందిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కోర్టు ఫార్మాలటీస్ అన్నింటినీ మర్యాద పూర్వకంగా పూర్తి చేసి శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు.

ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు నుంచి బెయిల్ పొందిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సెషన్స్ కోర్టు ఫార్మాలటీస్ అన్నింటినీ పూర్తి చేసి శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. సల్మాన్ రూ.30 వేల పూచీకత్తుతో పాటు, పాస్ పోర్టును కూడా సెషన్స్ కోర్టుకు సమర్పించారు. తొలుత ఈరోజు హైకోర్టులో కేసు విచారణ జరిగే సమయంలో సల్మాన్ వ్యక్తిగతంగా  హాజరుకాలేదు. విచారణ సమయంలో ఆయన బాంద్రాలోని ఇంట్లో ఉన్నారు. అయితే బెయిల్ మంజూరు కావడంతో సెషన్స్ కోర్టుకు సల్మాన్ హాజరయ్యాడు.

అంతకుముందు ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సల్మాన్ కు హైకోర్టులో ఉపశమనం లభించింది. దీంతోపాటు సెషన్స్ కోర్టు తీర్పును కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ ఎం తిప్సే ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు 30 వేల రూపాయల బాండ్ సమర్పించాల్సిందిగా సల్మాన్ ను ఆదేశించారు. సల్మాన్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement