సల్మాన్ కేసు అప్పీలుపై 14న నిర్ణయం | Salman case is on appeal decision on 14 | Sakshi
Sakshi News home page

సల్మాన్ కేసు అప్పీలుపై 14న నిర్ణయం

Dec 12 2015 2:52 AM | Updated on Sep 2 2018 5:24 PM

13 ఏళ్లనాటి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా బాంబే కోర్టు ప్రకటించటాన్ని సుప్రీంలో సవాల్ చేయాలా వద్దా అనే

ముంబై: 13 ఏళ్లనాటి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా బాంబే కోర్టు ప్రకటించటాన్ని సుప్రీంలో సవాల్ చేయాలా వద్దా అనే విషయాన్ని ఈ నెల 14 సోమవారం నిర్ణయిస్తామని మహా సర్కారు ప్రకటించింది. కాగా, గురువారం కోర్టు ఇచ్చిన తీర్పుతో.. ఈ కేసులో సాక్షిగా తన మిత్రుడు కమాల్ ఖాన్ వాంగ్మూలం తీసుకోవాలంటూ.. సుప్రీంలో వేసిన పిటిషన్‌ను సల్మాన్ వెనక్కు తీసుకున్నారు. మరోవైపు, సల్మాన్‌కు అనుకూలంగా తీర్పు రావటాన్ని స్వాగతిస్తున్నట్లు షారుక్ ఖాన్ తెలిపారు. త్వరలోనే సల్మాన్‌ను కలుస్తానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement