కేవలం మూడు రోజుల్లోనే 4.47 కోట్లు విరాళాలు! | Saibaba temple gets donations worth Rs 4.47 cr in 3 days | Sakshi
Sakshi News home page

కేవలం మూడు రోజుల్లోనే 4.47 కోట్లు విరాళాలు!

Jul 16 2014 2:55 PM | Updated on Oct 8 2018 6:18 PM

కేవలం మూడు రోజుల్లోనే 4.47 కోట్లు విరాళాలు! - Sakshi

కేవలం మూడు రోజుల్లోనే 4.47 కోట్లు విరాళాలు!

గురు పూర్ణిమ పర్వదినం నేపథ్యంలో షిర్డిలోని సాయిబాబ ఆలయానికి భారీగా విరాళాల్ని భక్తులు సమర్పించుకున్నారు

షిర్డి: గురు పూర్ణిమ పర్వదినం నేపథ్యంలో షిర్డిలోని సాయిబాబ ఆలయానికి భారీగా విరాళాల్ని భక్తులు సమర్పించుకున్నారు. గురు పూర్ణిమ సందర్భంగా జరిగిన మూడు రోజుల ఉత్సవాల్లో 4.47 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. 
 
గత సంవత్సరంతో పోల్చుకుంటే విరాళాలు గణనీయంగా పెరిగాయని నిర్వహకులు వెల్లడించారు. గత సంవత్సరం కార్యక్రమాలకు కేవలం 38 లక్షలు మాత్రమే వచ్చాయన్నారు. డొనేషన్ బాక్సులో నగదు, బంగారం, వెండి రూపంలో 3.10 కోట్ల రూపాయలు, ఆన్ లైన్ లో 1.46 కోట్లు వచ్చాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement