పార్లమెంటును ఎందుకు నిర్వహిస్తున్నారు? | Saamna Question Why Parliament Session Running | Sakshi
Sakshi News home page

పార్లమెంటును ఎందుకు నిర్వహిస్తున్నారు?

Mar 21 2020 8:02 AM | Updated on Mar 21 2020 8:03 AM

Saamna Question Why Parliament Session Running - Sakshi

ముంబై : కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలందరూ సోషల్‌ డిస్టేన్సింగ్‌ పాటించాలని ప్రధాని మోదీ ఓ పక్క విజ్ఞప్తి చేస్తూ మరోపక్క రాజకీయ కారణాలతో పార్లమెంటును నడిపిస్తున్నారని శివసేన ఆరోపించింది. ఈ మేరకు శివసేన తమ సామ్నా పత్రిక సంపాదకీయంలో విమర్శించింది. వేల మంది ఎంపీలు, అధికారులు, సిబ్బంది పార్లమెంటులో ఒక్క చోటికి వస్తున్నారని ఆ సంపాదకీయంలో రాసింది. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చివేసే చర్యలకు మద్దతునివ్వడానికే పార్లమెంటు సెషన్‌ నడుస్తోందని ఆరోపించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే అన్నింటిని పూర్తిగా లాక్‌డౌన్‌ చేయాలని సూచించింది. ముంబైని పూర్తిగా మూసేసే దిశగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే చర్యలు తీసుకుంటున్నారని పేర్కొంది. ప్రజలు రోడ్లపై ఉమ్మివేయడం ఆపేస్తే కరోనా కేసులు సగానికి తగ్గుతాయంది. వుహాన్‌ నగరాన్ని జనవరి 23 నుంచి లాక్‌డౌన్‌ చేశాకే అక్కడి పరిస్థితి మెరుగైందని పేర్కొంది. (క్వారంటైన్‌లో ఉండలేం)

52కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు..  
రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోగుల సంఖ్య 52కి చేరింది. గురువారం ఈ సంఖ్య 49 ఉండగా శుక్రవారం మరో ముగ్గురు రోగులు పెరిగారు. ఇందులో పుణే, పింప్రి–చించ్‌వడ్‌లో ఇద్దరు, మరొకరు ముంబైలో పెరిగారు. అయితే ఐదుగురికి కరోనా వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టడంతో ఆçస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement